శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
912. స్వస్థా | ||
తనయందు తానే ఉన్నది. సృష్టిలో అన్నింటా, అంతటా ఉన్న పరమేశ్వరి, తనలోనే ఆత్మ రూపములో వర్ధిల్లుతుంది. మాయకు అతీతముగా జీవాత్మ యే పరమాత్మ అన్న భావనే స్వస్థా. ఆత్మ రూపములో ఉన్న పరమేశ్వరికి నమస్కారము.🙏 🌺ఆత్మశుద్ధి లేని యాచారమదియేల? అన్న వేమన పద్యము విశ్లేషణ ప్రకారము ఆత్మ శుద్ధి ( మంచి ఆలోచనలు) లేకుండా ఆచారాలు పాటించడం వ్యర్థ ప్రయాస 🌺 |