శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
926. అనర్ఘ్య కైవల్య పదదాయినీ | ||
అతి ఉన్నతమైన కైవల్యాన్ని ప్రసాదిస్తుంది మరల పుట్టుక లేనటువంటి స్థితిని ప్రసాదిస్తుంది. భక్తులయొక్క పాప, పుణ్య కర్మలను బట్టి కైవల్యాన్ని ప్రసాదించే, మంగళ ప్రదాయినియైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 జీవుని యొక్క అంతిమ లక్ష్యం పరమేశ్వరి యొక్క కృపను పొందడమే. అది కేవలము గాయత్రి జపముతోనే సాధ్యము 🌺 |