శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
908. సౌమ్యా | ||
సౌమ్య స్వభావము కలది. సోమ అనగా చంద్రుడు నుంచి వచ్చింది సౌమ్య. చంద్రుడి వలె చల్లగా వెన్నెల వీచుతూ, అందముగా కనబడుతుంది. శాంత స్వభావముతో సౌమ్య స్వరూపముగల పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺సౌమ్య స్వభావముతో జరిగే సంభాషణ వల్ల , ఇతరులకు మన పట్ల గౌరవం పెరుగుతుంది. సమస్యలను సామరస్యముగా పరిష్కరించ వచ్చు 🌺 |