శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
928. స్తుతిమతీ | ||
స్తుతించినచో జ్ఞానమును ప్రసాదిస్తుంది పరమేశ్వరి యొక్క నామములను, శుచి, శుభ్రతను పాటిస్తూ ఎక్కడ పారాయణ చేసినా, అట్టి ప్రదేశానికి ఆ తల్లి తప్పకుండా వస్తుంది. పారాయణ చేసిన వారిపై జ్ఞానమును ప్రసాదించే పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 నామ పారాయణతో లలితా మాత అనుగ్రహాన్ని పొందుదాము🌺 |