శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
910. సవ్యాపసవ్య మార్గస్థా | ||
సవ్య , అపసవ్య మార్గ స్థానము కలిగి వున్నది. సవ్య, అపసవ్య మార్గము అనగా వామ , దక్షిణాచారములు, ఇడ, పింగళ నాడులకు సంకేతము. శివ శక్తి ఉపాసనా మార్గము . మూలాధారము నుండి సహస్రారమునకు పయనించుట అపసవ్య మార్గము. సహస్రారము నుండి మూలాధారము పయనించుట సవ్య మార్గము. ఈ రెండింటిని ఉపాసన చేయుట కేవలము గాయత్రీ ఉపాసకులకే సాధ్యము. మంత్ర ఆధీనమైన గాయత్రి మాత కు నమస్కారము🙏 🌺 ఆపదలనుండి రక్షిస్తుంది గాయత్రి మంత్ర జపం 🌺 |