శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
911. సర్వాపద్వి నివారిణీ | ||
సర్వ ఆపదలను నివారించునది. ప్రతి ప్రాణికి ఉఛ్ఛ్వాస నిశ్వాసల మధ్య ఆపద ఉన్నది. మరు క్షణము మన జీవితము ఎటుల ఉండునో, ఆ పరమేశ్వరికి ఎరుక. అందువలన ఆ పరాశక్తిని శరణు వేడగా, సర్వ ఆపదలనుండి రక్షిస్తుంది 🙏 🌺 తన భక్తుల ఆపదలను తృటిలో మాయం చేస్తుంది 🌺 |