శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
949. పంచభూతేశీ | ||
పంచ భూతముల తత్వ స్వరూపము పంచభూతములు అనగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వి. ఆకాశ తత్వము నుండి ఐదు పంచకములు, వాయు తత్వము నుండి పంచప్రాణాలు, అగ్ని తత్వము నుండి పంచ జ్ఞానేంద్రియములు, జల తత్వము నుండి పంచతన్మాత్రములు, పృథ్వి తత్వము నుండి పంచ కర్మేంద్రియములు. వీటి కలయిక వల్లనే మానవ దేహము ఏర్పడుతుంది. వీటిలో నివసించి వున్న పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 పరమేశ్వరి యొక్క కృపతో కలిగిన ఈ మానవ దేహమును అతి పవిత్రముగా కాపాడుకుందాము. 🌺 |