శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
974. బిందుతర్పణ సంతుష్టా | ||
శ్రీచక్ర బిందు స్వరూపము. ఈశ్వరునితో పరమేశ్వరి కూడి వున్న బిందు స్వరూపము. శ్రీ చక్ర నివాసిని మహా కామేశ్వరి, మహాకామేశ్వరుడు ఐన బిందు రూపానికి భక్తితో తర్పణము అర్పిస్తే సంతుష్టి చెందుతుంది. బిందు తర్పణముతో సంతుష్టి చెందే పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 లోక కళ్యాణం కొరకు చేసే ప్రతి పనికి పరమేశ్వరియొక్క కృప అపారంగా కలుగుతుంది 🌺 |