శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
992. అవ్యాజ కరుణామూర్తిః | ||
అపార కరుణా స్వరూపము. భక్తుల పట్ల అపార కరుణా మూర్తి. కేవలము భక్తితో, విశ్వాసముతో పూజిస్తే, సంపూర్ణమైన కరుణ కురిపిస్తుంది. పరమేశ్వరి యొక్క కరుణ కు కారణాలు అవసరము లేదు. కరుణా మూర్తియైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 మన మీద మనకు విశ్వాసము పెరుగుతుంది. సమాజ సేవ ఐనా , ఉద్యోగ ధర్మ మైనా , ఏ పనినైనా పట్టుదలతో సాధించగలుగుతాము🌺 |