శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
925. కేవలా | ||
బ్రహ్మ జ్ఞానము ధ్యాన స్థితి యందు సహస్రారమునకు చేరుకునే మార్గమున తాను మాత్రమే వున్నది కనుక కేవలా. బ్రహ్మ జ్ఞానమును కేవలా జ్ఞానము అని కూడా అందురు. జ్ఞాన ప్రాప్తి కలిగించి తద్వారా , ధర్మాచరణ చేసే శక్తిని ప్రసాదించే లలితా పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 అంతిమ కాలము నందు మనతో ఎవరు రారు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. మనతో వచ్చేదల్లా ధర్మా చరణ ఫలితమే అన్న సత్యాన్ని నమ్మాలి . కనుక ధర్మా చరణ ద్వారా పునీతులమౌదాము🌺 |