శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
909. సదాశివకుటుంబినీ | ||
సదా శివ కార్య రూపిణీ. సదా శివుని కార్య కారణ రూప తత్వములతో కుడిఉన్న కుటుంబానికి , సదాశివుని సంకల్పము నిర్వర్తించడానికి, శ్రీ కామేశ్వరీ రూపము దాల్చి సదాశివకుటుంబిని గా పూజించ బడుతుంది 🙏 🌺 సదాచారము పాటిస్తున్న కుటుంబానికి, వంశాభివృద్ధి కలిగించి, సకల అభీష్టాలను ప్రసాదిస్తుంది.🌺 |