శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
973. శుద్ధమానసా | ||
స్వచ్చమైన మనసు కలది. జ్ఞానముతో కూడి ఉన్న మనస్సు. రాగ ద్వేషములు లేకుండా, నిర్మలమైన మనస్సుతో చేసే పూజను స్వీకరిస్తుంది. అజ్ఞానముతో కూడి ఉన్న మనస్సు జీవుని యొక్క పతనానికి దారి తీస్తుంది. స్వచ్చమైన మనసుకలిగి ఉన్న పరమేశ్వరికి నమస్కారము. 🙏 🌺 అనుక్షణము, అంతరాత్మ పరిశీలనతో శుద్ధమైన మనస్సు ఏర్బడుతుంది 🌺 |