శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
916. చైతన్యార్ఘ్య సమారాధ్యా | ||
ఆత్మను పరమాత్మతో ఏకం చేయుట. చైతన్య శక్తి యైన ఆత్మను పరమాత్మకు అర్ఘ్యం ఇచ్చుట, సమర్పించుటయే చైతన్యార్ఘ్య సమారాధ్యా. కైవల్య మోక్ష ప్రదాయినియైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 మన శ్వాసలో, మాట లో, క్రియ లో, అంతా పరమేశ్వరి నిండి ఉన్నది. పరమేశ్వరి యొక్క ఆజ్ఞ, కృప లేనిదే పంచేంద్రియాలు సక్రమముగా పని చేయవు అన్న భావన సదా మనకి 'శ్రీ రామ రక్ష '.🌺 |