శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
946. పంచయజ్ఞప్రియా | ||
పంచ యజ్ఞము నందు ప్రీతి కలది. పంచకృత్యములే పంచయజ్ఞములు. సృష్టి, స్థితి, సంహారం, తిరోభావం, అనుగ్రహం అన్న ఈ పంచ కృత్యములు అంటే ప్రీతి. పంచ భూతములను ఆరాధించు వారి యందు ప్రీతి ఉన్న పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 నిత్య సంద్యోపాసన, అగ్ని కార్యము, దేవతార్చన, పితృ తర్పణము, అతిధి సత్కారము చేయు వారి యందు ప్రీతి కలిగి ఉంటుంది. 🌺 |