శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
702. దేశకాలాపరిచ్ఛిన్న | ||
దేశము, కాలము చేత కొలుచుటకు సాధ్యము కానిది పరాశక్తి ఇక్కడ వున్నది అక్కడ లేదు అన్న భేదము చేయుట సాధ్యము కాదు. సృష్టికి సాక్షిగా వున్న పరమేశ్వరికి అధికమైనది ఏమియు లేదు.అన్ని దిశలలో , కాలము యందు, అన్నింటా పరమేశ్వరీ నిండి వున్నది 🙏 🌺ధర్మ ప్రచారము, ధర్మ రక్షణ అన్ని దిశలలో, కాలపరిమితితో సంబంధము లేకుండా పాటించవచ్చును 🌺 |