శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
747. భక్తచిత్తకేకిఘనాఘనా | ||
చిత్తము ఆనందము పొందుతుంది భక్తుల యొక్క చిత్తము, వర్షములో కురులు విప్పి నాట్యము చేయు నెమలి వంటి ఆనందమును పొందుతుంది. జీవుడు అహర్నిశలు పరమేశ్వరి యొక్క స్మరణ, ధ్యానము వల్ల పొందే ఆనందమే భక్తచిత్తకేకిఘనాఘనా. భక్తుని చిత్తములో ప్రకాశిస్తూ కనపడే పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺అంచలంచలుగా భక్తి మార్గము వైపు నడవడము ప్రారంభిస్తాము, ఆనందాన్ని పొందుతాము🌺 |