శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
767. ఓజోవతీ | ||
తేజస్సు కలిగి వున్నది. సప్తధాతువుల యొక్క ఉత్క్రుష్టమైన తేజస్సే ఈ ఓజస్సు. దీనివల్లనే దేహసంబంధమైన అనేక భావములు కలుగుతాయి. శరీరములో ఓజస్సు తగ్గినచో, జీవును యొక్క ప్రాణము నశించును. ఓజస్సు రూపములో జీవుని యొక్క ప్రాణములను కాపాడు పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺మనిషి యొక్క ఆలోచనా దృక్పదాన్ని బట్టి, శరీరములో తగిన ఓజస్సు తయారఔతుంది.మానసిక,శారీరిక శక్తిని పెంచుతుంది🌺 |