శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
792. సామరస్య పరాయణా | ||
సామరస్యం యందు ఆసక్తి కలది సమరస, సమన్వయ, సమభావము కలిగి వున్నది.శివశక్తి యొక్క ఏక భావనే సామరస్య పరాయణా. ప్రకృతి పురుషులు ఇరువురు సమైఖ్య భావము కలిగి ఉండడము అన్నది విశేషమైన స్థితి. అర్ధనారిశ్వర తత్వము జీవులకు స్త్రీ పురుషుల పట్ల సమరస భావమును బోధించును. అందు ఆసక్తి చూపు పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺భార్య భర్త, ఇరువురి పట్ల సమైఖ్య భావన, ప్రేమ, గౌరవము కలిగి వుండాలి. సమాజంలో ఎన్నో అరిష్టాలను తొలగిస్తుంది 🌺 |