శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
780. విశ్వతోముఖీ | ||
విశ్వమంతా దశ దిశలుగా ముఖములు కలిగి వున్నది తూర్పు, పడమర (పశ్చిమ), దక్షిణ, ఉత్తర ఈశాన్యం, ఆగ్నేయం, నైఋతి, వాయువ్యం ఈ ఎనిమిది దిక్కులతో పాటు పైనా క్రిందా అన్నింటా, అంతటా అన్ని దిక్కుల యందు పరమేశ్వరి యొక్క ముఖములు కలదై యుండును. పరమేశ్వరిని ఆరాధించు వారికి శ్రీ మాతయే దిక్కు, వారికి దిక్కులతో పనిలేదు. సర్వాంతర్యామియైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 ఏన్నివైపులనుండి ఆపద వచ్చినా, వాటి నుండి రక్షించబడుతాము🌺 |