శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
724. సర్వతంత్రేశీ | ||
సర్వ తంత్రములకు అధిష్టాత్రి సృష్టి సర్వము దేవియొక్క ఆజ్ఞానుసారముగా నడుస్తుంది కనుక సర్వ తంత్రములు శ్రీమాతయే. సత్వగుణ సమోపేతముగా, నిష్కామముగా చేసే తంత్రపూజయే పరమేశ్వరి యొక్క పాదాల చెంతకు చేరును. సర్వ తంత్రములకు అధిష్టాత్రియైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺ప్రతిఫలా పేక్ష లేకుండా, సమాజానికి సేవలు అందించడానికి ప్రయత్నం మొదలుపెడతాము. 🌺 |