శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
726. సనకాది సమారాధ్యా | ||
బ్రహ్మ మానస పుత్రులచే చక్కగా ఆరాధించబడునది. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అన్నవారు బ్రహ్మ మానస పుత్రులు. నిత్య కౌమార దశను ప్రాప్తి పొందినవారిచే ఆరాధించబడు పరమేశ్వరికి నమస్కారము. పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ రూపాలలో పరమేశ్వరిని ఆరాధించడానికి ప్రయత్నిస్తాము. |