శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
729. ఆనందకలికా | ||
బ్రహ్మానంద స్థితి మూలాధారము వద్ద వున్న కుండలిని, మొగ్గ వలె కనబడుతున్న, ఆనందానికి ప్రారంభ స్థితి. సహస్రారము చేరు వరకు మొగ్గ వికసించిన పుష్పములా బ్రహ్మానంద స్థితికి చేరుస్తుంది. మనలోని కుండలిని శక్తి, మొగ్గ స్థాయి నుంచి పుష్పముగా వికసింపచేయు ఆనంద స్థాయికి చేర్చిన పరమేశ్వరికి నమస్కారము 🙏. 🌸ఆత్మానందమే పరమానందము అని తెలుసుకుంటాము 🌸 |