శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
781. ప్రత్యగ్రూపా | ||
ప్రత్యగాత్మ స్వరూపము మన అంతరాత్మ యందు నివసించి, అంతరంగములో ప్రత్యక్ ముఖముతో దర్శనము కలిగించు పరమేశ్వరియే ప్రత్యగ్రూపా. భక్తుని భక్తి పట్ల ప్రసన్నత కలిగి, వరములు ఇచ్చుటకు ప్రత్యన్ముఖియై ఇచ్చు పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 అంతరాత్మయే మనస్సాక్షి. ఏది మంచి, ఏది చెడు అన్ని చెప్తూ నిత్యము మనతో సంభాషిస్తుంది. చెడు పని చేయబోయే ముందర హెచ్చరిస్తుంది. మంచి పనికి శక్తిని ప్రసాదిస్తుంది. ఆత్మరాత్మ హెచ్చరికలను త్రోసివేస్తే, ప్రమాదము సంభవిస్తుంది 🌺 |