శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
770. ప్రియవ్రతా | ||
వ్రతములందు ప్రీతి కలది ఈశ్వరునిచే చెప్పబడిన వ్రతములు మనిషి యొక్క పూర్వజన్మ పాప కర్మలను మాపి వేయుటకు తొలి మెట్టు. మాయ వల్ల ప్రియము, అప్రియమైన భావములు కలుగుతాయి. నేను అనే అహం మానవుడికి ప్రీతి, అది మాయతో కూడి వస్తుంది. మాయ నుంచి తొలగించడానికి చేయు వ్రతము పరమేశ్వరికి ప్రీతి🙏 🌺జగన్మాతకు ప్రీతి కలిగించే కర్మలను చేద్దాము, అమ్మ కృపను పొందుదాము🌺 |