శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
742. భవదావసుధావృష్టి | ||
భవ, వస్తు, ధన సంపదలను పుష్టిగా వర్షించునది జీవుడి యొక్క కర్మ ఫలితమును బట్టి సంపదలను కురుపిస్తుంది. సంసారం అను అగ్నికూటమునందు అహుతి కాకుండా, పరమేశ్వరి యొక్క కృపతో భోగభాగ్యలను, వస్తు, కనకాది ధనములను ప్రసాదిస్తుంది. భవభోగములను ఇచ్చి,వస్తు ధన సంపదను కురిపించే పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺పరమేశ్వరియొక్క అనుగ్రహము కలగడమే అనంత సంపదకు వారసులము 🌺 |