శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
725. దక్షిణామూర్తిరూపిణీ | ||
బ్రహ్మా విద్యా స్వరూపిణీ దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది. శివశక్తుల సమైక్య రూపమే దక్షిణామూర్తిరూపిణీ. దక్షిణ అంటే - సృష్టి స్థితి లయ కారుకుడైన సగుణ బ్రహ్మ. మూర్తి అంటే - నిర్గుణ బ్రహ్మ. పరమేశ్వరి సగుణ, నిర్గుణ బ్రహ్మ స్వరూపిణి. కాబట్టే ఆమె దక్షిణామూర్తి రూపిణీ అనబడింది. ప్రయోజనమైన బ్రహ్మవిద్యను ప్రసాదిస్తుంది. సర్వ విద్యలకు గురువుయైన దక్షిణామూర్తి స్వరూపానికి నమస్కారము 🙏 🌺మేధా శక్తిని ప్రసాదిస్తుంది🌺 |