శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
797. కళానిధి | ||
సకల కళలకు నిలయము అరువది నాలుగు కళలకు నిధి వంటిది. ధీ: అనగా జీవుని యొక్క బుద్ధిని చైతన్య వంతము చేయు శక్తిస్వరూపిణి. బుద్ధి ప్రేరణతో కలిగే సకల కళలకు నిధియైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా | నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమ: || అన్న ఈ దుర్గా స్తోత్రం, పారాయణ,సకల మానవులకు శ్రేయస్కరము🌺 |