శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
741. రంభాదివందితా | ||
నయనానందకరమైనవారితో పూజింపబడుతుంది రాగము, నృత్యము యందు వచ్చు ధ్వని, చైతన్య రూపము, అనగా అమ్మవారి రూపము. అమ్మవారు సంగీత ప్రియ. అందుకని అమ్మవారి దగ్గర చెవులకు ఇంపుగా గానమును చేయు వారు, మరియు నయనానందకరమైన నృత్యమును చేయు వారు , అమ్మవారిని మెప్పించడానికి,భావనతో పూజ చేయు వారు, అనుగ్రహపాత్రులౌతారు. లయముతో గానము, నృత్యము చేయు వారిని, అప్సరలు అందురు. అందుకని అమ్మవారిని 'రంభాదివందితా'.అని స్తోత్రించారు 🙏 🌺పరమేశ్వరి యందు పూర్తి సమర్పణ భావముతో చేసే పూజ తప్పకుండా ఫలిస్తుంది🌺 |