శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
787. త్రిపురేశీ | ||
త్రిపురములకు ఈశ్వరీ భూ:,భువ: ,సువర్ణ లోకములకు ఈశ్వరీ. త్రిపురములు అన పడే స్థూల, సూక్ష్మ, కారణ దేహములకు ఈశ్వరీ అని మరియొక్క అర్ధం. త్రిపురములో భూత, భవిష్యత్, వర్తమాన కాలమునకు అధిష్టాత్రియైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺బాల్య,యవ్వన, కౌమారము అన్నవి మనిషి యొక్క జీవన దశలు. బాల్యము మనకి తెలియకుండానే గడిచిపోతుంది, యవ్వనము సంసార బాధ్యతలు, సంపాదన కొరకు సమయాన్ని వినియోగిస్తాము. కనీసము వార్ధక్యములోనైన భగవత్ ఆరాధన చేస్తూ, అంతరాత్మను తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. అన్ని దశలలో భగవత్ ఆరాధన చేయు వారు కారణ జన్ములౌతారు🌺 |