శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
761. సుభగా | ||
సౌభాగ్యదాయిని 'భగ' అనగా కాంతి, సూర్య కాంతి. సూర్యుని ఆరాధించు వారికి సౌభాగ్యమును ప్రసాదించునది. గాయత్రీ, సంద్యోపాసనము చేసి, సూర్యునికి అర్ఘ్యం ఇచ్చిన వారిపై సూర్యకాంతి ద్వారా సర్వ సౌభాగ్యమును ప్రసాదిస్తుంది🙏 🌺 నిత్యము అర్హులైన వారు త్రికాల సంధ్యావందనము, లేదా ఆదిత్య హృదయము పఠించాలి🌺 |