శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
777. వీరారాధ్యా | ||
వీరులచే ఆరాధించబడునది తన కర్తవ్యాన్ని పాటిస్తూ, ధర్మాచరణను వీడకుండా వుండే వాడే వీరుడు. పట్టు వదలని విక్రమార్కుడు వలే, కార్య సిద్ధి చేకూర్చు అతడు, వీరుడు. సుషుమ్నను మూలాధారము నుండి బ్రహ్మా కచ్చపర్యంతము నడపగలగడము వీరుడి లక్షణము.మాతృ భూమి, కన్నతల్లి, ధర్మ భూమికొసం పాకులాడే వాడైన వీరుడితో ఆరాధించబడే పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺ధర్మాధర్మ విచక్షణా జ్ఞానముతో, ధైర్యముగా ధర్మమార్గమున నడవగలుగుతాము🌺 |