శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
756. చండముండాసుర నిషూదినీ | ||
రాక్షస సంహారిణి చండుడు, ముండుడు అను రాక్షసులను సంహరించి, దేవతలచే స్తుతింపబడినది. జీవునియొక్క శరీరము నందు దేవి, అసుర శక్తులు రెండు వుండును. ఇడా నాడి దైవి సంపతు గా చంద్ర నాడి అని, అసుర సంపత్తు గా చండుడు అని, పింగళ నాడి యందు దైవి సంపత్తు గా సూర్య నాడి, అసుర సంపత్తుగా ముండుడు నివసించి వుంటారు. జీవుని అసుర లక్షణములు చండుడు, ముండుడు నశించినప్పుడే, దైవి సంపత్తు, సహస్రారం చేరుటకు ముఖ్యప్రాణము ఉద్భవిస్తుంది. రాక్షస సంహారము చేయు పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺మనలో వుండే రాక్షస స్వభావాన్ని తొలగించుకుంటాము 🌺 |