శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
746. భాగ్యాబ్ధిచంద్రికా | ||
భాగ్యమనే సముద్రమునకు వెన్నెలవంటిది. చంద్రుని వెలుగు చంద్రునిది కాదు, సూర్యునిది. సూర్యుని వెలుగు సూర్యునిది కాదు, అమ్మ పరాశక్తి వెలుగే. అమ్మ యొక్క వెలుగు ఎవరిపై పడితే, వారు భాగ్యవంతులు. భాగ్యవరదాయినీయైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺సిరి సంపదలు మన భాగ్యనుసారంగా లభిస్తాయి. భాగ్యరేఖ, పరమేశ్వరి యొక్క ఆరాధనతో,లభ్యమౌతుంది🌺 |