శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
722. గురుప్రియా | ||
గురువునకు ప్రియమైనది సత్య ధర్మములను భోదించు గురువు యందు ప్రీతి కలది. గురువు ద్వారా మంత్రోపదేశమును పొంది, తత్ ద్వారా పరమేశ్వరిని ధ్యానము చేయుట వల్లన సాక్షాత్కారము పొందగలుగుతాము కాబట్టి, గురువులయందు ప్రీతి కలిగి వుంటుంది. ఆదిగురువుయైన సదశివుని అర్ధాంగి అని కూడా ఈ నామము యొక్క విశ్లేషణ. గురుమంత్ర రూపములో వున్న పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺గురువు యొక్క వాత్సల్యము లభిస్తుంది🌺 |