శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
743. పాపారణ్యదవానలా | ||
పాపము అనే అరణ్యమును దహించునది సృష్టి యందు దుష్కర్మలుచేయుట ఫలితముగా పాపము పెరుగును. పాపములను అరణ్యముగా భావించి అట్టి పాపాత్ములైన అరణ్యమును దావాగ్ని స్వరూపమై పరమేశ్వరి నశింపచేయును. తనను ఆశ్రయించినవారి పాపములను దహించి, వారిని పాపరహితములుగా తీర్చిదిద్దును. అగ్ని స్వరూపములో వున్న పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺పాప పుణ్యముల విచక్షణా జ్ఞానము కలిగిస్తుంది 🌺 |