శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
782. పరాకాశా | ||
మూడు స్థితులలో ప్రకాశించునది ఆకాశము, మహాదాకాశము, పరాకాశము ఇట్లు మూడు స్థితులలో ప్రకాశించునది. పంచభూతములతో కూడి వున్నది ఆకాశము. త్రిగుణములతో కూడి వున్నది మహదాకాశము. పరతత్వముతో కూడి వున్నదే పరాకాశా. జ్ఞానముతో మాత్రమే పరతత్వాన్ని తెలుసుకోగలము. అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే పరమేశ్వరికి నమస్కారము🙏 🌺పరా జ్ఞానము ప్రసాదించమని పరాశక్తిని వేడుకుందాము🌺 |