శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
786. మంత్రిణీ న్యస్తరాజ్యధూః | ||
శ్యామలా దేవి యందు రాజ్య భారము వుంచినది శ్రీమాత మంత్ర రూపిణియే శ్యామలా దేవి. సృష్టి అంతయూ పరమేశ్వరి యొక్క రాజ్యము. సృష్టి నిర్మాణము అనంతరము , సంరక్షణ కొరకు శ్యామలా దేవిని నియమించినది. మంత్ర రూపములో వున్న శ్యామలా దేవికి నమస్కారము 🙏 🌺మంత్ర సిద్ధి తో దైవ సిద్ధి కలగడము సులభము. అందులకే సంకల్ప సహిత గాయత్రి మంత్ర జపము విశేషము 🌺 |