శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
753. మహాశనా | ||
సమస్త జగత్తునకు ఆహారము ఇచ్చునది. అశనము అనగా అన్నము సృష్టిప్రదాయిని అయిన జగన్మాత, తనలోనుండే సమస్త భూమండలాన్ని సృష్టించి, అన్నపూర్ణా స్వరూపమును దాల్చి, సమస్త ప్రాణకోటికి తగిన ఆహారము పుట్టించి, మరల మహాప్రళయ సమయమునందు మహాకాళి స్వరూపమును దాల్చి, తాను సృష్టించిన ఈ భూమండలాన్ని అంతటిని ఆహారముగా తనలో లయము చేసుకుని మహాశనా అని పిలవబడుతుంది 🙏 🌺సంతోషాన్ని ఇచ్చేది ఆ తల్లియే, ప్రళయాన్ని సృష్టించేది మరల ఆ తల్లియే. సమస్యని ఇచ్చినప్పుడు , సమస్యను పరిష్కరించడము కూడా ఆ తల్లిదే అన్న నమ్మకముతో ధర్మ బద్ధమైన జీవితము సాగించాలి అన్న ధైర్యము కలుగుతుంది.🌺 |