శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
713. గురుమండల రూపిణీ | ||
గురువులు అమె యొక్క రూపము అమ్మవారే గురువు స్వరూపము దాల్చి భక్తులను అనుగ్రహిస్తుంది. పరమేశ్వరీ అనుగ్రహం వల్ల ఆమెను ఉపాసించి సాయుజ్య స్థితిని పొందారు కాబట్టి ఆమెకీ, గురువులకీ భేధం లేదు అని ఈ నామము యొక్క అర్ధం. గురు రూపం మనసులో మెదిలితే ఆ రూపమే పరమేశ్వరీ ఆ రూపమే గాయత్రి స్వరూపము 🙏 🌺గురు కృప, అనుగ్రహము లభిస్తుంది 🌺 |