శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
757. క్షరాక్షరాత్మికా | ||
క్షరా- అక్షరముగా వ్యాపించి వున్నది క్షరా అనగా తాత్కాలికము, అక్షరా అనగా శాశ్వతము.సృష్టి అంతయు క్షరాక్షరముగా ఏర్పడివున్నది. జీవునికి తన పాప కర్మలను బట్టి గుణములు, రూపము కలుగును. అవి ఆశాశ్వతము, తాత్కాలికము , కాల మానప్రకారముగా మారుతూ వుంటాయి. జీవుని ఆత్మ జన్మ జన్మలకు శాశ్వతము. అందున కొలువై వున్న పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 ఆశాశ్వతమైన ఈ మానవ జన్మకి, పరుల పట్ల కోప, ద్వేషములు ఎందులకు? సద్గుణములు కలగాలి అని దేవిని వేడుకుందాము 🌺 |