శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
752. మహాగ్రాసా | ||
మహా విశ్వరూపిణి ఆవు గ్రాసము ఎలాఐతే నోటి నిండా తీసుకొని, కడుపులో దాచుకుంటుందో అటులనే పరమేశ్వరి, అండ, పిండ, బ్రాహ్మండమును సృష్టించి, ప్రళయకాలము అసన్నమైనప్పుడు , బ్రహ్మండమునే ఓ పెద్ద ముద్దని చేసి మ్రింగి పదిలముగా తనలో లీనము చేసుకుంటుంది.మహా పరాశక్తి విశ్వరూపమే మహాగ్రాసా🙏 🌺మనలో వుండే దుష్ప్రవర్తన, దుష్టబుద్ధి వంటి చెడు లక్షణాలను నాశనము చేసి, పరమేశ్వరి యొక్క పాద సేవకు అర్హులను చేస్తుంది🌺 |