శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
754. అపర్ణా | ||
పార్వతి దేవి రూపము శివుని కొరకు తపస్సు చేసిన పార్వతి దేవి. హైమవతి, గిరిజా అను పేర్లతో పిలవబడే పర్వతరాజ పుత్రిక. పర్ణా అంటే ఆకులు. శివుని పరిణయమాడ గోరిన గిరిజా దేవి, పర్ణములు ( ఆకులు)కూడా తినకుండా తపస్సు చేసినది కాబట్టి అపర్ణా గా ప్రఖ్యాతి గాంచినది🙏 🌺పట్టుదలతో కార్య నిర్వహణ సాగిస్తాము🌺 |