శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
744. దౌర్భాగ్య తూలవాతూలా | ||
దౌర్భాగ్యాన్ని పారద్రోలునది దౌర్భాగ్యము అనగా దురదృష్టము, తూల అనగా దూదిపింజము,వాతూలా అనగా గాలి దుమారము. పరమేశ్వరి యొక్క అనుగ్రముతో దౌర్భాగ్యము అనే దూది పింజమును ,గాలిదుమారముగా వచ్చి పారద్రోలును. దూది పింజలను గాలి ఎగురగొట్టినట్లు, జీవుల దౌర్భాగ్యాన్ని (దురదృష్టాన్ని) పారద్రోలు జగదీశ్వరికి నమస్కారము🙏 🌺అత్యంత భక్తిప్రశ్రద్ధలతో ఈ నామమును పట్టించిన వారికి దురదృష్టములు పోయి , అదృష్టవంతులై , సుఖసంతోషములతో జీవిస్తారు🌺 |