శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
772. దురాధర్షా | ||
స్వాధీనపరుచుటకు సాధ్యము కానిది పరమేశ్వరిని ఆరాధించు వారు, తల్లికి స్వాధీనము కావాలి తప్ప, పరమేశ్వరి తనకు స్వాధీనము కాదు. దుష్ట భావనతో పరమేశ్వరిని వశపరుచుటకు చేసే మాంత్రిక, తాంత్రికులు ఉపాసన వల్ల వారు పతనము కావడము తధ్యము. ప్రీతితో పరమేశ్వరిని ఆరాధించు వారి పట్ల వాత్సల్యము చూపు పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺సదా పరమేశ్వరి యొక్క పాద సేవలో తరిద్ధాము🌺 |