శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
748. రోగపర్వత దంభోళి | ||
భవరోగములను ద్వంశం చేయునది వజ్రాయుధముతో పర్వతముగా వున్న రోగమును ద్వంశం చేయునది. రోగమును పర్వతముతో పోల్చుటలో అర్ధము పెద్దది, దిర్ఘమైన వ్యాధి అని తెలుపుటకు. మనిషికి సంసారం సాగరములో అనుభవించే భవ రోగములు కన్నా మరియొక్కటి వుండదు. ఈర్షా, ద్వేషము, అహంకారము ఐత్యాదుల వలననే మనిషి రోగగ్రస్తుడు అవుతాడు. తన భక్తులకు ఈ భావరోగములను ద్వంశం చేసే పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺మానసిక, శారీరిక ప్రశాంతత ఒక్క దేవి స్మరణ, మరియు సత్సంగం వల్ల కలుగుతుంది. భవ రోగములను దూరము చేసుకొనుటకు మార్గము 🌺 |