శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
799. రసజ్ఞా | ||
నవరస భరితము నవరస స్వభావము కలిగి వున్నది. బ్రహ్మమును ఎరిగినవారు రసజ్ఞా అని చెప్పబడుతారు . జీవుడు, మాయగా తనను తాను తెలుసుకొని, మహామాయా అని మరి ఒకటి వున్నదని , తనకి ఆ మహా మాయ చైతన్య శక్తిని ప్రసాదిస్తుంది అని తెలుసుకోవడమే రసజ్ఞా. నవరసములను జీవునికి ప్రసాదించే పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺రస జ్ఞానమును ప్రసాదించమని పరాశక్తిని వేడుకుందాము🌺 |