శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
758. సర్వలోకేశీ | ||
అన్ని లొకములకు అధీశ్వరి సృష్టి లేనిచో ఈశ్వరి లేదు. ఈశ్వరి లేనిచో సృష్టి లేదు. ఈశ్వరికి సమస్తమందు వ్యాప్తి చెందు లక్షణము కలదు. తాను సృష్టించిన లోకము లేనిచో, తాను కూడా లేదు. జీవుడు లేనిచో శరీరము లేదు. ఏది లేనిచో మరియొక్కటి వుండదో అదియే ఈశ్వర తత్వము. అంతటా వ్యాప్తి చెందిన ఈశ్వరికి నమస్కారము 🙏 🌺పరమేశ్వరి యొక్క పాద సేవలో అంతటా వ్యాప్తి చెందుతాము. ధర్మ వ్యాప్తి జరుగుతుంది🌺 |