శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
737. ముక్తిరూపిణి | ||
ఆత్మజ్ఞానము ప్రసాదించునది ఆత్మ, పరమాత్మ యందు ఐక్యమై, బ్రహ్మానందము పొందుటయే ముక్తిరూపిణి. అజ్ఞానమును తొలగించి మోక్ష ప్రదాయినియైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺ఏకాగ్రతతో అమ్మను ధ్యానించి, సమర్పణా భావనతో సేవించిన వారిని తరింపజేయడానికి ఎల్లప్పుడు అమ్మ సిద్ధంగా ఉంటుంది.🌺 |