శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
727. శివజ్ఞాన ప్రదాయినీ | ||
ఆత్మజ్ఞాన ప్రదాయిని శివ తత్వము తెలియజేయడము అమ్మవారి సొత్తు. జ్ఞాన స్వరూపిణియైన పరమేశ్వరి, భక్తులకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. పరాశక్తిని ఆరాధిస్తే, శివ తత్వాన్ని, శివజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది 🙏 🌺ఆత్మ విచారణ అనే జ్ఞాన యోగ సాధన కలగాలి అని పరాశక్తిని ప్రార్ధిస్తాము🌺 |