శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
766. జపాపుష్ప నిభాకృతి | ||
జపాకుసుమ అకృతి కలది జపా పుష్పము అనగా అరుణోదయ కాంతి రంగులో వున్న మందార పువ్వు. నిభాకృతి అనగా రక్తబిందు స్వరూపిణి. అరుణము శక్తికి సంకేతము.ఈశ్వరుని యొక్క సంకల్పమును సాఫల్యము చేయుటకు,ఆకృతిని ధరించి ఇఛ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులను సాధ్యము చేయు పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺స్వఛ్ఛ మైన మనస్సు తో చేసే సంకల్పము, అరుణ కాంతి వలే ప్రకాశీస్తుంది. శుభమును చేకూరుస్తుంది 🌺 |